Blog Post

LYRIC WAVE > News > Naa Saami Ranga > Whistle Theme- Naa Saami Ranga

Whistle Theme- Naa Saami Ranga

దేవుడే తన చేతితో

రాసిన ఒక కావ్యం

అంజిది కిష్టయ్యది

విడదియ్యని ఒక బంధం

 

చిరునవ్వులు పూసే స్నేహం

చిరుగాలికి ఈల నా పాఠం

కడతేరని ఆనందంలో

కడదాకా సాగే పయనం

 

దేవుడే తన చేతితో

రాసిన ఒక కావ్యం

 

ఏరా ఒరే అనేటి

ప్రాణమిత్రులు

పరాచకాలతోటి

ఆటపాటలు

 

అన్నయ్య ఉంటే చాలుగా

ప్రాణాలు పంచే తీరుగా

కలిసింది పాలు తేనెలా

కలిపింది కాలం ప్రేమ పొంగేలా

 

దేవుడే తన చేతితో

రాసిన కమ్మని ఒక కావ్యం

అంజిది కిష్టయ్యది

విడదియ్యని ఒక అనుబంధం

Leave a comment

Post your requirment