పులి రా,
ఎగ ఎగబడితే బలిరా కలి రా
, బిర బిర బరిలో దిగెరా
వేట వినోదం,
ఇది వీర విహారం…
వేటు ప్రమాదం,
దయ లేని దుమారం…
నింగిని,నేలను
ముంచగ వచ్చెను
నిప్పుల ఉప్పెన ..
.అర్జు, ఫల్గుణ
అరుపులకస్సలు
ఆగని గర్జన
అడుగుల సడిలో
అలజడిగొలిపే
పిడుగుల ధ్వనినే వినరా
తికమకతికలో
సతమతమవని
చతురత తనదే, అనరా
ఎదిరికి ఎదురై
అదుపుని మరిచే
ఉరవడి కనరా
తన బిగి చెరలో
విడుదల అనగా
మరణము కదరా
మదమెక్కిన ఏనుగు
నది లోపల దిగినదో
పడిగాపుల మొసలికే
అది మిక్కిలి బలమురా
తలకెక్కిన పొగరుతో
తగరుంటే దురుసుగా
తన కొమ్ముల పదునుతో
ఢీ కొట్టద సరసర…
కలహం కలహం
కలదట ముసలం
భువనం గగనం
భయపడు తరుణం
చలనం చలనం
ఒక సంచలనం
గమనం గమనం
ఇది ఆగమనం