వెన్నెల్లో ఆడపిల్లా
కవ్వించే కన్నెపిల్లా
కోపంగా చూస్తే ఎల్లా
క్షణంలో అగ్గిపుల్లా
చాలు చాల్లే గాలిమాటలాపు
పనేమి లేదుగాని నీకు
పలకరించే వెన్నెల్లో ఓ జాబిలమ్మా
పులకరించే కబుర్లు విందామురామ్మా
ఈ వేళ కాని వేళా
నీ దారి మారిపోదా
నిజాయితీగా ఉన్న
మగాడ్ని నమ్మరాదా
నా నీడ కూడా
నిన్ను తాకి ఉలికిపడెనుగా
వెన్నెల్లో ఆడపిల్లా
కవ్వించే కన్నెపిల్లా
కోపంగా చూస్తే ఎల్లా
క్షణంలో అగ్గిపుల్లా ఓ ఓ
దాయి దాయి అంటూ
నను పిలిచిందే కలా
ఇంత రాతిరేలా
నలుగురు చూస్తే ఎలా
ప్రపంచానికేం వేరే పని లేదుగా
మన పనేదో మనదే కదా
ఇదే మాట నానుంచి రాలేదుగా
మగువపైనే నిందేయగా
జోలాలిగా సమయం కాదుగా
నిదుర ఈపూట దరిచేరునా
వెన్నెల్లో ఆడపిల్లా
వెన్నెల్లో ఆడపిల్లా
రేయి దాచుకున్న మెరుపుల జాబిల్లినీ
దొంగచాటుగానే నేలకు తెచ్చేదెలా
అరే నువ్వు ముందుంటే నిను చూడగా
చందమామే ఓడేనుగా
ఇలా కారుకూతల్ని చెబితే ఎలా
మనసు నీకే రాసివ్వనా
నీ వైపుగా కధ మారిందిగా
వెలుగు నీడల్లే నీ నా జత
వెన్నెల్లో ఆడపిల్లా
వెన్నెల్లో ఆడపిల్లా