అడ్డే లేదు అడ్డా లేదు
పడి లేచాడో ఉప్పెనల ఒడ్డే లేదు
ఏస్కో మీటర్ రాస్కో మ్యాటర్
హద్దే లేదు పద్దే లేదు
అనుకున్నాడో ఏదైనా రద్దే లేదు
ఏస్కో మీటర్ రాస్కో మ్యాటర్
అలా తరిమి తరిమి
పరుగు పెడితే తప్పదు లెక్క
అదో ఉరుము ఉరిమి
మెరుపులాగా ఉంటది పక్కా
చెడే చూసాడో ఇరగేసి రాస్తాడు
తిరగేసి పనిలో దిగితే గురిచూసి
దడ దడ దడ దడ ఉరుకుడే
అరె ఎడాపెడా ఎడాపెడా ఉతుకుడే
దడ దడ దడ దడ ఉరుకుడే
అరె ఎడాపెడా ఎడాపెడా ఉతుకుడే
అదరగొట్టు బెదరగొట్టు చెదరగొట్టు
కొట్టేయ్ కొట్టేయ్ కొట్టు కొట్టు
గురినిపెట్టు గురుతుపట్టు
మడతపెట్టి కొట్టు కొట్టు
బాకీ పడ్డ ఖాకి డ్రెస్సు
ఓకే అంటూ ఎక్కేసాడు
దానెనక ఉన్న పవరు తెలిసి
దారిలోకి వచ్చేసాడు
కథే మలుపు తిరిగి
మనసు చెదిరి పోయినచోటే
ఎదే తలుపు తెరిచి
గెలుపు వెతికి ఆడెను వేటే
అరె ఎదురొస్తే ఎవడైనా
ఎదురించే దమ్మున్న
తెగువ పొగరు ఉన్నోడు
దుము దుము దుమ్మెత్తించే దులుపుడే
అరె కుమ్మీ కుమ్మీ ఆడేస్తాడు చెడుగుడే
దుము దుము దుమ్మెత్తించే దులుపుడే
అరె కుమ్మీ కుమ్మీ ఆడెస్తాడు చెడుగుడే