రం రం
రం రం రం రక్తవర్ణం
దినకర వదనం తీక్షన దంష్ట్రాకరాళం
రం రం రం రమ్యతేజం
గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రమ్
రం రం రం రాజయోగం
సకలశుభనిధిం సప్త భేతాళభేద్యం
రం రం రం రాక్షసాంతం
సకలదిశయశం రామదూతం నమామి
ఖం ఖం ఖం ఖడ్గహస్తం
విషజ్వర హరణం వేదవేదాంగదీపం
ఖం ఖం ఖం ఖడ్గరూపం
త్రిభువన నిలయం దేవతాసు ప్రకాశం
ఖం ఖం ఖం కల్పవృక్షం
మణిమయ మకుటం
మాయ మాయా స్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం
సకల దిశయశం రామదూతం నమామి
ఇం ఇం ఇం ఇంద్రవంద్యం
జలనిధికలనం సౌమ్య సామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధియోగం
నతజనసదయం అర్యపూజ్యార్చితాంగమ్
ఇం ఇం ఇం సింహనాదం
అమృత కరతలం అది అంత్యప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం
సకలదిశయశం రామదూతం నమామీ
సం సం సం సాక్షిభూతం
వికసిత వదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం
సకల మునినుతం శాస్త్ర సంపత్కరీయం
సం సం సం సామవేదం
నిపుణ సులలితం నిత్య తత్త్వస్వరూపం
సం సం సం సావధానం
సకలదిశయశం రామదూతం నమామి
హం హం హం హంసరూపం
స్ఫుటవికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం
హం హం హం అంతరాత్మం
రవిశశి నయనం రమ్మగంభీరబీమం
హం హం హం అట్టహాసం
సురవర నిలయం ఊర్ధ్వరోమం కరాళం
హం హం హం హంసహంసం
సకలదిశయశం రామదూతం నమామీ