మహా ఫాలనేత్ర
శివోహం శివోహం
చితాభస్మ వాఘ్రష్య
శివోహం శివోహం
మదీయాత్మ దీపం శివో దీపితం
మహాదేవ దేవ శివోహం శివోహం
అనన్య భక్తి భావమే
ఆరాధన ప్రవాహమై
ఆకాశగంగా తీరులా
వర్షించే శివుని శిరసుపై
నిరంజనానురక్తియై
నీరాజన ప్రకాశమై
గిరీషు జఠా తలమున
వెలింగె చంద్రవంకయై
సమస్త సృష్టి లయములో
ముక్కంటి ద్రుష్టి మాత్రమై
అనంత కాల గమనము
చలించే భువుని భావమై
వెలాగి నేను జారిన
విభూతి కనని విశ్వమై
వర్ధిల్లే ప్రాణి సకలము
అనాది ప్రణవమూలమై
అమేయ భక్త బంధువై
అపార దయా సింధువై
నన్నాశ్రయించే శివంకరుడు
లంకావన భృంగమై
విరించి విష్ణు
దేవతాదులెవరి దర్శనార్థమై
తపింతు దూతనే నను
వరించే ఆత్మలింగమై
దశా దిశాలి నిండుగా
ప్రచండ శంఖానాధమే
ప్రభాస కాంతిపుంజమై
అఖండ శైవ తేజమే
శంభో మహా శంభో
నియాదనిదీ మగుడ పాఠం
సద్బక్తి భిల్వమిది
మహేశునిదీ హృదయ పీఠం
మదీయాత్మ దీపం శివో దీపితం
మహాదేవ దేవ శివోహం శివోహం