Blog Post

LYRIC WAVE > News > Saindhav > Sarada Saradaga – Saindhav

Sarada Saradaga – Saindhav

ఎగిరే స్వప్నాలే మనం

మనదే కాదా గగనం

సిరివెన్నెలలో తడిసే గువ్వలం

చిరునవ్వులలో చననం

 

ఇది చాల్లే ఇంతే చాల్లే

ఇదిలా నిత్యం ఉంటే చాల్లే

ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేల్లుగా

ఊపిరిలో సుమగంధాలే

 

సరదా సరదా

సరదాగా సాగింది సమయం

మనసు మనసు దూరాలే మటుమాయం

మనకు మనకు పరదాలే లేనే లేవందాం

ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం

 

కలలా ఉందేంటీ నిజం

నిజమేనందీ నయనం

మనకే సొంతం అవునా ఈ వరం

విరబూసింది హృదయం

 

అందాల పూల వందనాలు

చేసే రాదారులే

తల నిమురుతున్న

పలకరింపులాయె చిరుగాలులే

 

ఈ ఉల్లాసమే మనకో విలాసమై

మనసంతా చిందాడిందే

 

సరదా సరదా

సరదాగా సాగింది సమయం

మనసు మనసు దూరాలే మటుమాయం

మనకు మనకు పరదాలే లేనే లేవందాం

ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం

 

ఆనందమే అరచేతులా

వాలిందిలా పసిపాపలా

ఒక గుండెలో

ఈ మురిపెమంతా బంధించేదేలే

 

కరిగి ఆ వానవిల్లే ఇలా

రంగుల్లో ముంచెత్తగా

ఈ చిత్రం ఏ కుంచెలైనా చిత్రించేదేల

 

సరదా సరదా

సరదాగా సాగిందీ సమయం

మనసు మనసూ దూరాలే మటుమాయం

మనకు మనకూ పరదాలే లేనే లేవందాం

ఒకరికి ఒకరై ఒదిగింది అనుబంధం

 

Leave a comment

Post your requirment