నువ్వు రాజకుమారివి జానకి
నువ్వు ఉండాల్సింది రాజభవనంలో
నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం
మీ నీడైన మిమ్ముల్ని వదిలి వెళ్తుందేమో
మీ జానకి వెళ్ళదు
హో ఓ ఆదియు అంతము రామునిలోనే
మా అనుబంధము రామునితోనే
ఆప్తుడు బంధువు అన్నియు తానే
అలకలు పలుకులు ఆతనితోనే
సీతారాముల పున్నమిలోనే ఏ ఏ
నిరతము మా ఎద వెన్నెలలోనే
రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్
జానకి రాఘవది
ఎప్పటికీ ఈ జానకి రాఘవదే
నా రాఘవ ఎవరో
ఆయన్నే అడిగి తెలుసుకో
నన్ను తీసుకువెళ్ళినపుడు
దశరధాత్మజుని పదముల చెంత
కుదుటపడిన మది
ఎదుగదు చింతా
రామనామమను రత్నమే చాలు
గళమున దాల్చిన కలుగు శుభాలు
మంగళప్రదము శ్రీరాముని పయనమూ ఊ ఊ
ధర్మ ప్రమాణము రామాయణము
రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్
రాం సీతా రాం
సీతా రాం జై జై రామ్