ఓరి వారి నీది గాదురా పోరి
ఇడిసెయ్ రా ఇంగ ఒడిసెను దారి
ఓపారి అవ్వ ఒడిలో దూరి
మరిసెయ్ రా సిన్న మొల్లిగా మారి
బాల్యమే గొప్పది బాధ మర్షిపోతది
చందమామ రాదనే నిజము నమ్మనంటది
చిన్న పల్లీపట్టీకె ఏడుపాపి చూస్తది
కోడె ఈడు సెడ్డది నిజాన్ని కోడై కూస్తది
ఓరి వారి నీది గాదురా పోరి
బజ్జోరా సంటి బిడ్డగా మారి
హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో
హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో
ప్రేమ నాలో దాచిన
చిన్న బొడ్డెమ్మగానే గావురంగా
నిన్ను నేనే వద్దనీ
గిరిగీసుకున్న గింత దెల్వకుంటా
రగిలి నా వేదనే దీపమోలే వెట్టినా
పేర్చినా బతుకమ్మనే
కన్నీళ్ళలో సాగదోలిన ఇడిచేసి వదిలేశిన
రెక్కలిరిగినట్టి ఈగ
సుడిగాలిలో చిక్కినట్టు
దిక్కు మొక్కు లేని కన్ను
ఎక్కి ఎక్కి ఎడ్శినట్టు
నీకు దగ్గరవ్వలేక
దూరమయ్యే దారిలేక
చితికిపోయే నా బతుకిలా
గుండె పుండు మీద
గొడ్డు కారమద్ది గుద్దుతుంటే
గుక్కపెట్టి ఏడవలేని జన్మా
ఓ ఓఓ ఓ ఓఓ ఓ
ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ
హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో