Blog Post

LYRIC WAVE > News > Bro > Okasaari Putti – Bro

Okasaari Putti – Bro

నాది నాదన్నదేది

నీతో రాలేను అంది

రాసుందిలే ముందే ఈ సమయం

తెలుసున్నదే తప్పదని పయనం

 

నీ ఇల్లు కొన్నాళ్ళు ఈ దేహము

విడిచెల్లి పోతుంది నీ ప్రాణము

కను తెరిచి మూసేటి ఆటే కదా

కన్నీరుగా జారిపోయే కథ

 

ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి

తెంచేసుకోవాలి ఈ బంధమూ

బ్రతుకంటె ఎట్టి మిగిలేది మట్టి

చావన్నది జన్మకే అందము

 

వెలుగులను చల్లు నీ దారిలో

పేరు నిలిపెల్లు నీ యాత్రలో

ప్రేమే పంచే మనసు నీకుంటే

పెంచే మంచే వస్తుంది వెంటే

 

విలువే ఉంది ఊపిరే ఉంటే

నిను మరిచిపోదా కనబడకపోతే

సరిదిద్దుకోలేనిది కాలము

నీ నవ్వులుండాలి కలకాలమూ

 

ఏ వైపు వేస్తున్న నీ అడుగులు

గురుతుండి పోవాలి నీ జాడలో

 

ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి

తెంచేసుకోవాలి ఈ బంధమూ

బ్రతుకంటె ఎట్టి మిగిలేది మట్టి

చావన్నది జన్మకే అందము ఓ ఓ

Leave a comment

Post your requirment