లాలిజో రాగం
హాయి నీ గానం
గోముగా తాకే
ప్రేమ నీ రూపం
వేకువే చూపే
దారి నీ సొంతం
నీడ నీవైతే
చీకటే దూరం
సాటిరాలేవే
సంద్రాలు సైతం
అంతమే లేనీ ఆరాటం
తూలుతూ ఉంటే
చిన్నారి పాదం
ఊరుకోగలదా నీ ప్రాణం…
కాలం ప్రియం ఇదొక శ్రవణం
మౌనం ప్రియం మధుర మథనం
భారం ప్రియం అలల లలనం
భావం ప్రియం కలల కవనం
అలుపనక
మురిపెముగా
మనసుని మలిచిన తొలి పలుకా…
తుది అనక,
తడబడక, కలలని తడిపిన కను చినుకా…
వేడుక దాగిన ఆమని దిశగా
ఆగక సాగిన ఆశల నడక
వేల అమాసల విధి ఎదుట
ఒకింత తలొంచని వెలుగుల నడవడిక
కాలం ప్రియం ఇదొక శ్రవణం
మౌనం ప్రియం మధుర మథనం
భారం ప్రియం అలల లలనం
భావం ప్రియం కలల కవనం