Blog Post

LYRIC WAVE > News > Rangabali > Kala Kantu Unte – Rangabali

Kala Kantu Unte – Rangabali

అందరిలోను ఒక్కడు కాను

నేను వేరే తీరులే

కలిసే తాను వెలిగే మేను

మాయ నాలో జరిగెనే

ఇది ఓ వింతే

 

మనసేమో ఆగదసలే

ఎగిరింది పైకి మేఘాలు తాకి

గురి చూసి దాటె గగనాలనే

ఇరుకు గుండె లోతులకి

కాలమే ముడిచి అంతరిక్ష మొదిగే

 

కల కంటు ఉంటె అది కరిగి కరిగి

నిజమంటు మాయ మరి జరిగి జరిగి

జగమంత చోటు మరి తరిగి తరిగి

భుజమంటుకుంటు తెగ తిరిగి తిరిగి

 

విడిగుంటె గుండె

మరి నలిగి నలిగి

ఎదురుంటె ప్రేమ ఇక

పెరిగి పెరిగి పెరిగీ

 

తళుకు తళుకుమని మెరిసె నా కొరకు

అనిగిమనిగి మరి వచ్చె నీ కుదుపు

సహజమే నాకు ప్రాణమయ్యేటి

మాయే మాయే

 

మాయ మాయే అంత మాయే

నువ్వు లేనీ ఊహలే

మాయ మాయే సొంతమాయే

కంచె లేని లోకమే

 

వదిలుండలేని అలవాటులా

ముదిరే ప్రేమ చూడు నేడిలా

 

కల కంటు ఉంటె అది కరిగి కరిగి

నిజమంటు మాయ మరి జరిగి జరిగి

జగమంత చోటు మరి తరిగి తరిగి

భుజమంటుకుంటు తెగ తిరిగి తిరిగి

 

విడిగుంటె గుండె

మరి నలిగి నలిగి

ఎదురుంటె ప్రేమ ఇక

పెరిగి పెరిగి పెరిగీ

 

అందరి లోను ఒక్కడు కాను

నేను వేరే తీరులే

కలిసే తాను వెలిగే మేను

మాయ నాలో జరిగెనే

ఇది ఓ వింతే

 

ఎవరు ఎవరు అని అడిగె నా మనసు

అవును నిజమె నువు కొంచెమే తెలుసు

తెలియనేలేదు కమ్మేనే జోరు మాయే మాయే

 

మాయె మాయే అంతా మాయే

ఒంటరైనా నిన్నలే

మాయె మాయే సొంతమాయే

నన్ను దాచే కన్నులే

 

వదిలుండలేని అలవాటులా ముదిరే

ప్రేమె పొంగే నదిలా

 

కల కంటు ఉంటె అది కరిగి కరిగి

నిజమంటు మాయ మరి జరిగి జరిగి

జగమంత చోటు మరి తరిగి తరిగి

భుజమంటుకుంటు తెగ తిరిగి తిరిగి

 

విడిగుంటె గుండె

మరి నలిగి నలిగి

ఎదురుంటె ప్రేమ ఇక

పెరిగి పెరిగి పెరిగీ

Leave a comment

Post your requirment