ఎవరు ఎదురు రాగలరు మీ దారికి
ఎవరికుంది ఆ అధికారం
పర్వత పాదాలు వణికి కదులుతాయి
మీ హుంకారానికి
నీ సాయం సదా మేమున్నాం
సిద్ధం సర్వ సైన్యం
సహచరులై పదా వస్తున్నాం
సఫలం స్వామి కార్యం
మా బలమేదంటే
నీపై నమ్మకమే
తలపున నువ్వుంటే
సకలం మంగళమే
మహిమాన్విత మంత్రం నీ నామం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం
ధరణి మూర్చిల్లు
నీ ధనస్సు శంకారానాదానికి జారే హో
గగన గోళాలు భీతిల్లు
నీ బాణ ఘాతానికి జారే హో
సూర్యవంశ ప్రతాపం ఓ ఓ
శౌర్యమే నీ స్వరూపం ఓ ఓ
జగతికే ధర్మ దీపం
నిండైన నీ విగ్రహం ఆ ఆ ఆ
సంద్రమైన తటాకం ఓ ఓ
సాహసం నీ పతాకం ఓ ఓ
సమరక్రీడాతిరేకం
కన్యాద నీ రాజసం
మా బలమేదంటే
నీపై నమ్మకమే
మాతో నువ్వుంటే
విజయం నిశ్చయమే
మహిమాన్విత మంత్రం నీ నామం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం రాజారాం
జై శ్రీరాం జై శ్రీరాం
జై శ్రీరాం