Blog Post

LYRIC WAVE > News > Gandhari > Gandhari – Gandhari

Gandhari – Gandhari

గాంధారి గాంధారి

నీ మరిది గాంధారి

దొంగ సందమామ లాగా

వంగి చూసిండే

 

గాంధారి గాంధారి

నీ మరిది గాంధారి

దొంగ సందమామ లాగా

వంగి చూసిండే

 

గాంధారి గాంధారి

నీ మరిది గాంధారి

సెంగు సెంగునొచ్చి

హోలీ రంగు సల్లిండే

 

పోయిన ఏడు ఇంత పోకిరి కాడు

రైకల వాసనా తెలియనివాడు

ఇంతలోపల ఏమి జరిగెను

సూదుల సూపుతో గుచ్చుతున్నాడే

 

గాంధారి నీ మరిది

ఏందేందో చేసిండే

సింధూరి సెంపాకు

సిరి గంధం పూసిండే

 

గాంధారి నీ మరిది

గందరగోళం సందడి

మందిలోన ఎట్లా సెప్పమందు

వాని అంగాడి

 

సుందారం బొమ్మనట

మందారం రెమ్మనట

పిందెలాగా ఉండే

లంక బిందె వంటాండే

 

కందిరీగ నడుమంట

కందిపూలు ఒళ్ళంట

ఎందుకిట్ల ఎండలోన

కందిపోతున్నావని రందిపడి భుజాన

కూసుందువు రమ్మంటాండే

 

గాంధారి గాంధారి

నీ మరిది గాంధారి

దొంగ సందమామ లాగా

వంగి చూసిండే

 

గాంధారి గాంధారి

నీ మరిది గాంధారి

సెంగు సెంగునొచ్చి

హోలీ రంగు సల్లిండే

 

బంగారు సీతారామ

సింగారు లగ్గానికి

సేంగాబి సీర గట్టి

మంగళారతి ఇస్తాంటే

రంగు జల్లి ఎదురుకోళ్ల

రంగు పండగంటాండే

పండుగ ఏదైనా

రంగు పండుగనే అంటాండే

 

గాంధారి గాంధారి

నీ మరిది గాంధారి

దొంగ సందమామ లాగా

వంగి చూసిండే

 

గాంధారి గాంధారి

నీ మరిది గాంధారి

సెంగు సెంగునొచ్చి

హోలీ రంగు సల్లిండే

Leave a comment

Post your requirment