ఉల్లి మల్ల సీర గట్టి
కజ్జలు పైకెగగట్టి
ఉల్లి మల్ల సీర గట్టి
కజ్జలు పైకెగగట్టి
ఉన్నవాళ్ళ పిల్లనంటవా గుమ్మా
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందన
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందనా
బీర పువ్వు రైక సుట్టీ
బిల్లంత బొట్టు పెట్టి
బీర పువ్వు రైక సుట్టీ
బిల్లంత బొట్టు పెట్టి
బైటకడుగు పెట్టనంటవా భామా
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందన
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందనా
ఎత్తుకెళ్ళి పోతావా పోతావా
ఎత్తుకెళ్ళి పోతావా పోతావా
బెల్లం సెరుకు సూపుల దాన
అల్లం మిరప మాటలదాన
బొండుమల్లి నడుము దాన
బండెడు సోకుల ఓ నెరజాన
నువ్వట్ట పోతుంటే ఓ ఓ ఓ
నిన్నిట్ట సూత్తుంటే ఓఓ ఓ ఓ
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
నారెట్టి సుట్టేసి మోపల్లె కట్టేసి
నా నెత్తి మీదెట్టి గోదారి గట్టెంట
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
కడవల్లో నింపేసి కావిల్లో పెట్టేసి
ఇడిసి పెట్టకుండ నిన్నింక కడదాక
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే
నువ్వు నడిచెళ్ళితే
నీ కాలి అంచు తాకి
మట్టి బెడ్డలన్ని
మువ్వలయ్యాయే
నువ్వు నవ్వుతుంటే
ఆ నవ్వు తీపి సోకి
చెట్టు కొమ్మలన్నీ
తేనే పట్టులయ్యాయే
ఎంత ఎంత ఎంత ముద్దుగున్నావంటే
ఒక్క ఒక్క మాటలోన చెప్పాలంటే
చందమామకే పిల్లలు పుడితే
హే చందమామకే పిల్లలు పుడితే
నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే
మరి అట్టా ఉంటె ఏం చేస్తాం
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
నా గుండెకోటలో రాణివి నువ్వంట
నా రెండు కాళ్ల పల్లకిలోనా
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
మన ప్రేమకు పూసిన చిన్నారి పొన్నారి
పిల్లల్ని నువ్వు సంకనెత్తుకునేదాక
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే