తెల్లగా తెల్లవారిందే
హే సరాసరా
వెచ్చగా వేకువ వచ్చిందే
హే సురాసురా
కోలమ్మ కోలో కొమ్మ గుమ్మల్లో
గువ్వా గువ్వా
కొండ కోనమ్మ జళ్ళో
వాగమ్మ పాటే మువ్వా మువ్వా
ఏలమ్మ ఏలో
ఏరమ్మ ఒళ్ళో గవ్వా గవ్వా
ఆహ ఏ రంగు లేని
సారంగమంటే నువ్వా నువ్వా
ఇంత అందం చందం గంధంలాగ
గంతే వేసే పల్లెటూరు సాటేది రాదే
మచ్చుకైనా మచ్చేది లేదే
కొత్త పాత అంటు తేడా లేనే లేదు
ప్రేమ ప్రతిక్షణం
రారా అని పోదామని
కలగలిపే పిలుపు ఇది
డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే
డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే
తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే
తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే
తెల్లగా తెల్లవారిందే
హే సరాసరా
వెచ్చగా వేకువ వచ్చిందే
హే సురాసురా
చెక్కర లేని పాలల్లో
చెక్కిన మీగడ తీపల్లే
కారంగా ఉన్న
ఊరించే ఆవకాయల్లే
హే చుక్కలు లేని గీతల్లో
చక్కగ గీసిన ముగ్గల్లే
కోరంగి దాటె
కోనసీమ నావల నీడల్లే
తన ఒళ్ళే తుళ్ళి మళ్ళీ మళ్ళీ
జల్లే చల్లే మేఘంలాగ
కోనంగి కళ్ళే పంపెనే
చూపుల కౌగిళ్లే
అవి ఎల్లకిల్లా అల్లీ గిల్లి
అల్లో మల్లో ఆకాశంలో
అల్లాడెనే తెల్లారులు
కలవరపడి కల వదిలే
డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే
తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే