చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపూ
అస్తమానం నీలోకమే నా మైమరపు
చేతనైతే నువ్వే నన్నాపూ
రా నా నిద్దర కులాసా
నీ కలలకిచ్చేశా
నీ కోసం వయసు వాకిలి కాశా
రా నా ఆశలు పోగేశా
నీ గుండెకు అచ్చేశా
నీ రాకకు రంగం సిద్దం చేశా ఆ
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది ఆ
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది
గోరింట పెట్టింది ఆ
సామికి మొక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ ఆ ఆ అరరారే
చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు
మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి
హత్తుకోలేవా మరి సరసన చేరీ
వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి
ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరీ
చెయ్యరా ముద్దుల దాడి
ఇష్టమే నీ సందడి
ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారీ
రా ఈ బంగరు నెక్లేసు
నా ఒంటికి నచ్చట్లే
నీ కౌగిలితో నన్ను సింగారించు
రా ఏ వెన్నెల జోలాలి
నన్ను నిద్దర పుచ్చట్లే
నా తిప్పలు కొంచెం ఆలోచించు ఆ
ఎందుకు పుట్టిందో పుట్టింది
ఏమో నువ్వంటే
ముచ్చట పుట్టింది ఆ
పుడతానే నీ పిచ్చి పట్టింది
నీ పేరు పెట్టింది
వయ్యారం ఓణీ కట్టింది
గోరింట పెట్టిందిఆ
సామికి మొక్కులు కట్టింది
చుట్టమల్లే చుట్టేస్తాంది
చుట్టమల్లే చుట్టేస్తాంది
ఆ ఆ ఆ అరరారే
చుట్టమల్లే చుట్టేస్తాంది
తుంటరి చూపు
ఊరికే ఉండదు కాసేపు