బహుసా బహుసా బహుసా..
తారగతి గదిలో ఆగవా ఓ మనసా..!
బహుసా బహుసా మనసా..!
తిరిగొస్తునే ఉంటానని నీకలుసా..!
నీ చెంపలనే కెంపులతో
నింపావనుకున్నా బహుసా
నువ్వు నచ్చేసా..?
నీ చెక్కరా మాటల్లో
నే చెక్కుకుపోయానని తెలుసు..
నాన్నే ఇచ్చేసా..
ఎగిరే తారాజువ్వ
చూస్తే అది నీ నవ్వా..
పొగిడే మాటలు
ఎన్నున్నా సరిపోవా…
కళ్లతో నవ్వే కాలువ
ఊహలకందని నీ విలువ
ఓ కనికట్టల్లే ఏమ్మాయో చేసావా…!
మెలకువలో నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
తీరికనే ఇవ్వవే..!
మెలకువలూ నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
చివరకి ఎటు చూడు నువ్వే నువ్వే..!
బహుసా బహుసా బహుసా..
తారగతి గదిలో ఆగవా ఓ మనసా..!
బహుసా బహుసా మనసా..!
తిరిగొస్తునే ఉంటానని నీకలుసా..!
పలుకుల ధరా
గుణగణమే ఔర..
నలుగురిలో నడిచే ఓ తారా..!
తెలిసిన మేరా
ఒకటే చెబుతారా
ఆలయమే లేని దేవతారా…!
నీ లక్షణం చెప్పనీ
అక్షరాలేమైనా వద్ధింకా నాకోద్ధింకా..
ఏ వంకలు పెట్టలేనంతగా
నచ్చవే నెలవంక…
చాలే చాలింక…
మెలకువలో నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
తీరికనే ఇవ్వవే..!
మెలకువలూ నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
చివరకి ఎటు చూడు నువ్వే నువ్వే..!
బహుసా బహుసా బహుసా..
తారగతి గదిలో ఆగవా ఓ మనసా..!
బహుసా బహుసా మనసా..!
తిరిగొస్తునే ఉంటానని నీకలుసా..!