Blog Post

LYRIC WAVE > News > Dasara > Chamkeela Angeelesi – Dasara

Chamkeela Angeelesi – Dasara

చమ్కీల అంగీలేసి ఓ వదినే

చాకు లెక్కుండేటోడే ఓ వదినే

కండ్లకు ఐనా బెట్టి

కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే

 

సినిగిన బనీనేసి ఓ వదినే

నట్టింట్ల కూసుంటడే ఓ వదినే

మాసిన లుంగీ ఏసి ఎప్పుడు

మంచంలనే పంటడే

 

హే పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే

నీ సీర సింగులువట్టి ఎనకెనక తిరిగిన్నే

ముద్దులిస్తుండే పూలు తెస్తుండే

శెక్కర లెక్క నీ మాటలుంటుండే

మారే నీ తీరు పెరిగే నీ నోరు

మందుకలవాటైతినే

 

కడుపులో ఇంత వోసి ఓ వదినే

కొడ్తడే బండకేసి ఓ వదినే

అమాస పున్నానికో అట్లట్లా

అక్కరకు పక్కకొత్తాడే

 

చమ్కీల అంగీలోడే

నాకు జుమ్కీలు అన్న తేడే

 

వీడు వంటింట్ల నేనుంటే

సాటుంగ వత్తుండె

వంకర నడుము గిచ్చుతుండే

నేడు ఎంత సింగారించిన

వంకలు పెడుతుండే

తైతక్కలాడకంటుండే

 

కంట నీరన్న వెట్టకుండా

సంటి బిడ్డ లెక్క నిన్ను

అలుగుతుంటే బుదరగియ్యలేదా

 

నువ్వు సీటికి మాటికి

గింతదాన్ని గంత జేసి

ఇజ్జతంత బజార్లేస్తలేవా

 

ఏం గాలి సోకేనో ఓ ఓ

వీన్నెత్తి తిరిగెనో ఓ ఓ

పాతబడ్డనేమో శాతనైతలేదో

ఉల్టా నన్నిట్ల మందీ ముంగట్ల

బదనాం జేత్తడే

 

చమ్కీల అంగీలేసి ఓ వదినే

చాకు లెక్కుండేటోడే ఓ వదినే

కండ్లకు ఐనా బెట్టి

కత్తోలే కన్నెట్ల కొడ్తుండెనే

 

నోరిడిసి అడగదుర బామ్మర్ది

శెప్పింది చెయ్యదుర బామ్మర్ది

పక్కింట్లో కూసుంటది

నా మీద శాడీలు జెప్తుంటది

 

నా గొంతు కోసిర్రంటూ బామ్మర్ది

శోకాలు వెడ్తుంటది బామ్మర్ది

ముచ్చట్లు జెప్పబోతే మీ అక్క

మూతంతా తిప్పుతుంటది

 

శీకట్ల ఉన్నా వాకిట్ల ఉన్నా

కంటికి రెప్పోలే కాస్తడు మొగడు

ఎంత లొల్లైనా నువ్వెంట ఉంటె

ఎదురు నిలిశి వాడు గెలిశి వస్తాడు

 

గోసల్ని జూస్తా ఉన్నా

ఏదైనా గుండెల్ల దాస్తాడులే

నీ బొట్టు నీ గాజులే ఎంతైనా

వాని పంచ పాణాలులే

Leave a comment

Post your requirment