Blog Post

LYRIC WAVE > News > Dasara > Dhoom Dhaam Dhosthaan – Dasara

Dhoom Dhaam Dhosthaan – Dasara

ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటం

అంత లావైతే గుంజుకుంటం తింటం పంటం

ఐతై ఐతై ఐతై ఐతై బద్దల్ బాషింగాలైతై

 

అరె ఏం కొడుతుర్ర బై ఊకోర్రి

నీ యవ్వ మా మావగాడు శెప్పుడు సరే మీరు కొట్టుడు సరే

అరె ఓ నైంటి ఈల్లకు ఇంకో నైంటి పోయ్రా

ఎట్ల కొట్టరో సూత్త నీ యవ్వ్

 

పవ్వగొట్టు పవ్వగొట్టు

బోటికూర దానంచుకు వెట్టు

బ్యాండు గొట్టు బ్యాండు గొట్టు

వాడకట్టు లేసూగేటట్టు

 

గుద్దితే సూస్కో ఓ అద్ధశేరు

గజ్జల గుర్రం ఈ సిల్కుబారు

ఇచ్చి పడేద్దాం

చల్ కుచ్చి పడేద్దాం

ఎవ్వడడ్డమొత్తడో జూద్దాం బాంచెత్

 

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

 

టెక్క టెకం టెక్క టెకం

టెక్క టెకం టిటక్ టిటక్

డింక టకం డింక టకం

డుర్ర డుర్ర డుర్ర

 

కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్

సుట్టూర దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్

జమ్మిని బొగ్గును బంగారమే అంటం

బంగారంలాంటి మనుషుల్లో ఉంటం

 

డొక్కలు నింపే ఊరే మా అవ్వ

జేబులు నింపే రైలే మా అయ్య

బర్ల మోత ఆ శెర్ల ఈత

ఇగ కోడి కూత మాకేం ఎరుక బాంచెత్

 

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

 

ధూం ధాం అరె ధూం ధాం

భలె భలె భలె భలె భలె

హ హు హా హే

 

సిత్తూ సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారి బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

రాగి బిందె తీస్క రమణి నీళ్ళకు బోతే

రాములోరెరాయేనమ్మో ఈ వాడలోన

 

తీట లెక్కల్ జేస్తేనే జోరు

ఘాటుగా ఉండాలిరా బతుకు తీరు

నల్లీ బొక్కల్ జూత్తే ఉషారు

ఏం తింటవ్రా ఉప్పు లేని పప్పు శారు

 

గోశి గొంగడి మా కట్టుబొట్టు

ఎట్లైతే గట్లైతది సూస్కుందాం పట్టు

అంబలి గట్క మాది రాచ పుటక

పూట పూట మాకే దసరా బాంచెత్

 

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

 

ధూం ధాం అరె ధూం ధాం

భలె భలె భలె భలె భలె

హు హా హు హే

Leave a comment

Post your requirment