పంతం కోసం ఆకలే వీడు
అధికారం కోసం మోహమే వీడు
ఐశ్వర్యం కోసం అత్యాశే వీడు
అందరు ఆగిపోయిన చోట
మొదలౌతాడు వీడు
అందరిని భయపెట్టే చీకటినే
భయపెడతాడు వీడు
అవసరమనుకుంటే తన నీడను
వదిలేస్తాడు వీడు
సచ్చిపోయేటప్పుడు ఏదో
తీసుకుపోయే వాడు వీడు
హే నన్నన్నే నన్నన్నే తన్నే నానే నానే
తా నన్నన్నే నానే నానే నానా
హే నన్నన్నే నన్నన్నే తన్నే నానే నానే
తా నన్నన్నే నన్నెన్నానే నానా
వీడు హా వీడు హా
ఎదురొచ్చిన వాన్ని తొక్కేస్తాడు వీడు
వీడు హా వీడు హా
ఎదిరించిన గొంతు నొక్కేస్తాడు వీడు
వీడు హా వీడు హా
ఎదగడమే జన్మహక్కంటాడు వీడూ
కామం అంటే కోరుకోవడం
కోరిక లేని బ్రతుకే శూన్యం
కరుణే లేని ఈ కలంలో
క్రోధం అన్నది కాచే కవచం
నష్టం చేసే నలుగురిలోన
లోభం అన్నది ఎంతో లాభం
మెత్తగ ఉంటే మొత్తేస్తారు
మదమే ఇప్పుడు ఆమోదం
వేడికి వేడే శీతలం
మత్సరమే మంచి ఔషధం
దుర్జనులుండే ఈ లోకంలో
దుర్గుణమే సద్గుణమంటాడు వీ–డు
నన్నన్నే నన్నన్నే తన్నే నానే నానే
తా నన్నన్నే నన్నెన్నానే నానా
వీడు హా వీడు హా
ఎదురొచ్చిన వాన్ని తొక్కేస్తాడు వీడు
వీడు హా వీడు హా
ఎదిరించిన గొంతు నొక్కేస్తాడు వీడు
వీడు హా వీడు హా
ఎదగడమే జన్మహక్కంటాడు వీడూ