ఎవరే పిల్లా
అరవిరసిన మల్లా
నువ్ ఎవరే పిల్లా
తొలకరి చిరుజల్లా
కుదురైన కుర్రాడిని
కొరికుదిపేసిందే
తీరైన చిన్నోడిని
ప్రేమలొ ముంచేసిందే
కన్నే కునుకొదిలేసె
కళ్ళల్లో కలువలు పూసె
నీ కలలతొ నను కమ్మేసే
కనికారం బావుందమ్మా
పెదవే పలుకొదిలేసే
నీ మౌనంలో మునకేసే
మెలమెల్లగ ప్రాణం తీసే
సుకుమారం నీదేలేమ్మా
అరకొరగా చూసే నీ చూపే
సరిపడకా నీ దారుల వేచే
కలివిడిగా ఆడే నీ మాటే
విడిపడనీ ముడి ఎదో ఏసే
సూఫియానా సూఫియానా
గుండెల్లోనా ప్రేమవానా
ఏంటమ్మా కులుకా
నీ ఎనకే ఎనకే తిరిగాక
కాదంటే ఎలగే నిను తీరా వలచాక
ఏంటమ్మా తళుకా
అట్టాగే గాలికి వదిలెయ్ కా
కాస్తైనా వినవే ఈ పిల్లాడి ఊసింత
చీకటినెరుగవు నీ నయనాలు
వెలుతురులూరగ నీ కనుచూపులు
శీతలమౌనే ఆ పవనాలు
సోకినా చాలే నీ పాదాలు
నీ వలనే అలలు గోదారినా
వదిలెయ్ కే నన్ను నాదారినా
నీ చలవే జాబిలై నింగినా
ఈ నేలకు వెన్నెలై జారినా
సూఫియానా సూఫియానా
గుండెల్లోనా ప్రేమవానా