Blog Post

LYRIC WAVE > News > HanuMan > Avakaya Anjaneya – HanuMan

Avakaya Anjaneya – HanuMan

ఆవకాయా ఆంజనేయా

కధ మొదలెట్టినాడు సూడరయ్యా

శక్తినంతా కూడగట్టి

సెట్టు దులిపినాడు అంజయ్యా

 

ఎర్ర ఛాయా ఎర్ర ఛాయా

కోతి అవతారమెంత మాయ

కత్తి సేత పట్టుకుండా

కాయ కోసినాడు కపిలయ్యా

 

అంజనమ్మ ముందు

వంజుల్ పుంజుల్

చీడిమామిడి ముక్కలు

కుప్పల్ తెప్పల్

 

ఆ ఆ అంజనమ్మ ముందు

వంజుల్ పుంజుల్

చీడిమామిడి ముక్కలు

కుప్పల్ తెప్పల్

 

టెంకలోని జీడి వంకలెన్నున్నా

టెంకలోని జీడి వంకలెన్నున్న

పులిగోరు పళ్లతో పరపర తీసాడురో

 

అంజనాద్రి హనుమంతో

నీ సురుకు సెప్పలేనంతో

అంజనాద్రి హనుమంతో

నీ శక్తి లెక్క ఉప్పెనంతో

 

బక్కవాటం లెక్కసేయక

కల్లుప్పు కడలి వదలనంటే

తోకతోటి కెరటమాపి

ఒడ్డు నెండేసాడు ఉప్పుపంట

 

గొడ్డుకారం గొడ్డుకారం

ముక్క మునిగి పైకి పొక్కుతుంటే

సిన్నితల్లి కంటిరెప్పనంటకుండా

తిప్పె గాలివాటం

 

ఆవపిండి అంత చల్లి చల్లి

ఆరబెట్టినాది తల్లి తల్లి

ఆవపిండి అంత చల్లి చల్లి

ఆరబెట్టినాది తల్లి తల్లి

 

గండుపిల్లి ధూళి గట్టిగెగిరొస్తే

గండుపిల్లి ధూళి గట్టిగెగిరొస్తే

అడ్డుగా నిలుచుని

అంగుటతో మింగాడురో

 

కాకి కూతలు గోర చప్పుళ్ళు

ఆవకాయ తంతు జరగతుంటే

మెంతులేసేనంతలోనే

పిట్టలెల్లగొట్టినాడు గధ ఎత్తి

 

నువ్వుడొంక దిష్టి బొమ్మ

పచ్చడొంక సూసి దిష్ఠి పెడితే

వెల్లుల్లి రెబ్బల్ల జబ్బలిరిసి

నూనె తెండినాడురో కుండెట్టి

 

సట్టినిండా సరుకు కుక్కి కుక్కి

ఉట్టి నెట్టి ముగ్గెట్టి ఎట్టి

సట్టినిండా సరుకు కుక్కి కుక్కి

ఉట్టి నెట్టి ముగ్గెట్టి ఎట్టి

 

అంత పెద్ద దేవుడస్సలాగలేకా

అంత పెద్ద దేవుడస్సలాగలేక

ఆవజాడి తీసి రుస్సప్పరించాడురో

 

అంజనాద్రి హనుమంతా

నీ సురుకు సెప్పలేనంతో

అంజనాద్రి హనుమంతా

నీ శక్తి లెక్క ఉప్పెనంతో

Leave a comment

Post your requirment