చీకటికే చూపి వెలుగే
వేకువనే మేలుకొలిపే
అడుగులే వేసి కదిలేనా
మొదలేనా
ఒదసలో చూడు పురుగే
సీతాకోకై మారు వరకే
రెక్కలకై వేచు సహనానా
ఏ దారిలో ఏమున్నదో
ఏ కాలమో దాగున్నదో
తెలియకుండా తెలుపుతుందో
తీరమేదో చూపుతుందో
దాటలేని మాటే పొరబాటే
సరి చెయ్యగా మారిన మాటే
విధి ఇవ్వాలే నీతోటే
కనిపించక ఆడిన ఆటే
కెరటమే తగ్గదా
లోతుకే వెళ్లి చూస్తే
లోకువే కాదులే
మనసనే మాట వింటే
కాలం మారేనా
దారే చూపేనా
ఓనం నీలోనా
ఆశేదో నింపేనా
ఓ మలుపేరో ఓ మలుపేరో
ఏ దరి చేరో ఈ మలుపేరో